Halloween party ideas 2015

 సిరిసిల్ల సింగర్ శిరీషతో…సైటీవి

ఆమె పాట కొండల్లో కోయిలమ్మ కూత

ఆ గొంతులో జలపాతల మోతలుంటాయి

ఆమె పేరు శిరీష

ఆ పేరుకు అర్థం దిరిసెన పువ్వు .

అంతే అందంగా మధురంగా పాడగలదు.

ఆ కట్టుబొట్టు

తెలుగింటి ఆడపడచు చందమే,

ఈ మధ్యకాలంలో

ఏ టిక్ టాక్ విడియో చూసినా యేమే పిల్ల పాటనే,

ఏ రింగ్ టోన్ విన్న శిరీష పాటనే వినిపించింది

సినిమా పాటలనే మైమరిపించి

ప్రపంచ తెలుగు ప్రజల పెదాలపై తేలియాడుతున్న

అనేక పాటలు పాడినా

సిరిసిల్ల శిరీష సింగర్ ఇంటర్వ్యూ మీ సైటీవి లో…


సైటీవి : నమస్కారం సిరిసిల్ల సింగర్ శిరీష గారు

శిరీష : నమస్కారం…

సైటీవి :

మిమ్మల్ని తెలంగాణ జానపద కోయిలమ్మగా తెలంగాణ ప్రజలు ప్రేమగా పిలిస్తే ఏమంటారు ?

శిరీష : అందులో నా గొప్పతనమేమి లేదు

తెలంగాణ జానపదాల గొప్పతనం.

ఆ జానపదాలను పాడుతూ వింటూ ఆధారించే తెలంగాణ ప్రజలది గొప్పహృదయమనే చెప్తాను.

సైటీవి: మీ బాల్యం,విద్యాభ్యాసం చెప్పండి ?

శిరీష : మాది చేనేత చీరలకు పట్టుకొమ్మ సిరిసిల్ల

నా బాల్యమంత ఇక్కడే గడిసింది.

నేను ఇంటర్ చదువుకున్నాను.

నేను ఏదీ చేసినా

నాన్ననే మొట్టమొదటిగా ఎంకరేంజ్ చేసేది.

సైటీవి: మీ పాటల ప్రయాణం ఎలా ప్రారంభమైంది ?

శిరీష : నేను హాస్టల్‌ లో ఉండి చదివేటప్పుడే నాకు,పాటకు బాటపడింది మా హాస్టల్ లో డ్యాన్స్ టీచర్

గడ్డం దేవయ్య సర్ నాతో పాటలు పాడించేవారు. మా బడిలో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది దాంతోపాటు నాకు బహుమతి కూడా ఖచ్చితంగా వచ్చేది‌. అలా నేను ఆరు ఏడు తరగతులు చదివేనాటికే పాట నా గొంతులో నుండి ప్రవహించడం మొదలైంది.

సైటీవి: మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా లేదా

మీ ఇంటిలో ముందుతరం ఎవరైనా గాయకులున్నారా ?

శిరీష : నేను ఎలాంటి సంగీతం నేర్చుకోలేదు స్టూడియోలో ఏదైనా పాట పాడమన్నప్పుడు చెప్పిన మెలకువలే నేను నేర్చుకున్న పద్దతులు.

మా ఇంటిలో మా అమ్మ నాన్న బాగా పాడుతారు అదే నాకు కొద్దివరకు సంక్రమించిందని అనుకుంటా

నాకు పాట ఇచ్చి ఎలా పాడలో చెప్తే పాడుతాను.


ఈ పాట కోసం ఫోటో పై క్లిక్ చేయండి.సైటీవి: మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాటలు ?

శిరీష: అత్త కొడుకా ముద్దుల మారేలయ్య, టిక్కు టాకుటిక్కు, యేమే పిల్ల అన్నప్పుడల్ల, బాల పరుశరామా,

వచ్చన్న పోరా బావా,పొడిపొడి వానలు కురువంగా,

రామ సక్కనోడా నా రాములు,రాజు రాజు ,అత్తగారింటికి కొత్తగా ఒతున్న ఇంకా చాలా ఉన్నాయి ప్రతీ పాట నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కేటట్లు చేసిందనే చెప్తాను.ఒక పాట తక్కువ ఒక పాట ఎక్కువని చెప్పలేను అదంతా పాటవిన్న ప్రజలే చెప్పాలి.

సైటీవి: జానపదాలపై మీ అభిప్రాయం ఏమిటి ?

శిరీష: పాట అంటే ఇష్టపడని మనిషిని నేను చూడలేదు,అందులో జానపదం అంటే మరింత ఇష్టం ఉంటుంది. జానపదంలో ఒకరకమైన లయ మనల్ని ఉత్తేజితం చేస్తుంది.పిల్లల నుండి పెద్దవారిదాకా ఈ పాటల్ని ఎంతో ఉత్తేజకరంగా వింటారు.నాకైతే జానపదం ప్రాణంతో సమానం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన పాటమ్మకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను.

సైటీవి: ఇంట్లో అమ్మ,నాన్నల సపోర్ట్ ఎలా ఉండేది ?

శిరీష: ఈరోజు నేను మీ ముందు ఇలా ఉండటానికి ముఖ్యమైన వ్యక్తి నా బలమంత నాన్ననే, నేను భయపడినప్పుడల్లా వెనుక నుండి ముందుకు నడిపించే నా హీరో మా నాన్ననే, ఇంకా అమ్మ సహకారం ఎప్పుడూ ఉండేది.


సైటీవి: మీకు ఇష్టమైన రచయిత ఎవరు ?

శిరీష: అందరి పాటలు ఇష్టమే.(నవ్వుతూ…)

సైటీవి: మీ రోల్ మోడల్ ఎవరు ?

శిరీష: శివ వేల్పుల నా భర్త ,వాస్తవంగా శివ పరిచయమే

నా జీవితంలో ఇంత ఇమేజ్ కు కారణం.

శివ ఏదీ చేసినా నా మంచికోసమే చేస్తాడని నమ్మాను అప్పటినుండే నా ఎదుగుదల ప్రారంభం.


సైటీవి: మిమ్మల్ని బయటి సమాజంలో ప్రజల గుర్తుపడుతున్నారా ?

శిరీష : హా ఖచ్చితంగా గుర్తుపట్టి సెల్ఫీలు దిగుతారు.

కొందరి ప్రేమకు ఎంత కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.

ఎక్కడికెళ్లినా మీరు తెలంగాణ సంప్రదాయంగా ఉంటారనీ, మీరు మా ఇంటి ఆడబిడ్డలాగా ఉన్నవనీ పెద్దలు అంటుంటే ఈ జన్మకు ఇదీ చాలనీ అనుకున్న సందర్భాలున్నాయి.

సైటీవి: సినిమా అవకాశాలు వస్తే జానపదం వదిలేస్తారా ?

శిరీష: వదిలేయను నా మొదటి ప్రాధాన్యత జానపదానికే.

సైటీవి: నిన్ను ఇంతలా అభిమానించి ఆధారించిన తెలంగాణ ప్రజలకు ఏమీ చెప్తారు ?

శిరీష: తెలంగాణ మట్టిలోనే జానపదం ఉంది. ఏ సింగర్ పాడినా పాటలో గొప్పతనం ఉంటే గుండెల్లో దాసుకునే గుణం తెలంగాణ ప్రజలది. నేను పాడుతున్న పాటకు కంచుకోట ఇక్కడి ప్రజల పాటనే, ఆ పాటనే ప్రజలకు నన్ను దగ్గర చేసింది కాబట్టి ఈ ఋణం ఎప్పటికీ మర్చిపోలేను.all© riseved chandu gonela

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blogger ఆధారితం.